Posts

Showing posts from July, 2021

Nallanamma నల్లనమ్మ

Image
నల్లనమ్మ నలుపు, కఱ్ఱి, అసిత, చామనచాయ, ఏమిటో నీ రంగు చెప్పమ్మా? చీకటి వర్ణం లో ఉన్న నీకు, వెలుగు అక్కరు ఎందుకమ్మా? నీ అందం కనుపాపలకు తెలియునా? వాటి రంగూ అదే అని వాటికి తెలియదుగా. నీ అందం నిశి రాత్రిలో దాగినా, గుండె చప్పుడు గట్టిగా వినిపించునుగా. నీ నెత్తురు ఎరుపు కాదా మరి? కన్నీరు కి రంగు కలదా నీకు? మన మంచిని తెలుపంటే మరి, మేనంతా చెడు ఉందనా నీకు? నల్లని నేల పై రైతు పంట పండించినా, ఆ నేలేగా పోసింది పంటలో జీవాన్ని. చీకటి లో జీవం పోసుకున్న మనిషి కూడా, చేరాలనుకోలేదా ఆ నల్లని అంతరిక్షాన్ని? తెలుపుపైన మక్కువ చూపినా, నలుపే గా ప్రపంచం లో ఎక్కువ. నీ లోని ప్రాణం ఉన్నంతవరకు, నల్లనమ్మా నీకు ఏమి తక్కువ?