Posts

Showing posts from September, 2020

Alajadi

Image
మదిలో నింపుకున్న ఆశలు జ్ఞాపకాలు కమ్మని వరము ఇచ్చెను ఆ దేవుడు కలలు గా కనమని... పూల పొదరిల్లు మధ్యలో మల్లెల గంధం లో తడచి ఊగేను నా మనసు ఈ తపన లో జారిన చీర చెంగును మరచి... చైత్రపు రాత్రి వీచే వెచ్చని గాలిలో శ్రావణ జల్లుకై వేచి చూస్తున్నా కార్తీక దీపాలను కనులలో నిలిపి మాఘం మంచి రోజుకై ఎదురుచూస్తున్నా... వాలు జడలో బిగించిన కురులు నీ బిగి కౌగిలి గురుతు చేస్తున్నాయి ఎడబాటుని గ్రహబాటు అనుకుని నా తపనల తలపులు భరిస్తున్నాయి... అందని చందమామ అందానికి అందిన జాబిల్లి అద్దినట్లు మెరుగులు అందించుకుని నాదైన నీ జత కోసం నా మనసు తీసే నీకై పరుగులు... చేరిన వెంటనే చెరదీసుకో నన్ను నీలో సగం చేసుకుని ప్రియతమా ఇంత గా వెల్లడించినా నా ప్రేమని దూరాన నువ్వు ఉండటం భావ్యమా??? ~సుచిత్ర